Delhi Pollution: దీపావళి ఎఫెక్ట్ ఇంకా తగ్గలే..ఢిల్లీ మొత్తం పొగమంచే

Delhi Pollution: దీపావళి ఎఫెక్ట్ ఇంకా తగ్గలే..ఢిల్లీ మొత్తం పొగమంచే

ఢిల్లీలో దీపావళి పటాసులు ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. శనివారం ( నవంబర్ 2) ఉదయం దేశ రాజధాని ఢిల్లీ మొత్తం పొగమంచుతో కమ్ముకుంది. దీపావళి రోజు ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చడం, ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వ్యర్థాలు తగలబెట్టడంతో ఇంకా ఆ ఎఫెక్ట్ చూపుతోంది. SAFAR India డేటా ప్రకారం.. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం ఉదయం 10.30  గంటలకు 380గా నమోదు అయింది. 

ఆనంద్ విహార్ లో ఉదయం 7 గంటలకు AQI 380 గా నమోదు అయింది. ITO లో ఉదయం 6 గంటలకు 253, ఆర్కే పురంలో 346, ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు ప్రాంతంలో 342 గాAQI నమోదు అయింది. సెంట్రల్ పొల్యూషనల్ కంట్రోల్ బోర్డు ప్రకారం ద్వారకా సెక్టార్ లో శనివారం ఉదయం 7గంటలకు AQI 308గా నమోదు అయింది.