రాజ్యాంగ ప్రక్రియను అనుసరించొద్దా? : స్మృతి ఇరానీ

రాజ్యాంగ ప్రక్రియను అనుసరించొద్దా? : స్మృతి ఇరానీ
  •     మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలనడంపై స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ ప్రక్రియను అనుసరించాలని అపొజిషన్ కోరుకుంటున్నదా? లేదా? అని నిలదీశారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన స్మృతి ఇరానీ.. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే ముందుగా జనాభా లెక్కింపు, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

‘‘రాజ్యాంగ ప్రక్రియను ఫాలో కావద్దనేది ప్రతిపక్ష నాయకుల కోరికనా? రాజ్యాంగానికి కట్టుబడి ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న వైఖరి అదేనా? మహిళా సాధికారత విషయంలో ప్రతిపక్షాలు అడ్డుగోడగా మారకుండా ఉంటే చాలు.. వారికి కృతజ్ఞులం” అని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని రాజ్యాంగం నిషేధించిందన్నది వారికి తెలియదని ఎద్దేవా చేశారు.