సీఎం మీడియాతో మాట్లాడుతుండగా వచ్చిన పాము.. చంపొద్దు అంటూ ఆదేశాలు

సీఎం మీడియాతో మాట్లాడుతుండగా వచ్చిన పాము.. చంపొద్దు అంటూ ఆదేశాలు

ఓ పాము ఏకంగా సీఎం ప్రెస్​మీట్​కి వచ్చింది. అవునండీ నిజమే. ఛత్తీస్ గఢ్ ​సీఎం భూపేష్ ​భగేల్​ ఆగస్టు 21న మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఓ పాము అక్కడికి  వచ్చింది. పామును చూసి భయాందోళనకు గురైన అధికారులు, సిబ్బంది దానిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. 

అయితే సీఎం తన సిబ్బందిని వారిస్తూ పామును చంపకూడదని ఆదేశించారు. అదొచ్చినందుకు కంగారు పడకండీ.. దాన్ని చంపకండీ అంటూ చెప్పారు. అధికారులు స్నెక్ క్యాచర్స్​ సాయంతో పాముని పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలేశారు. 

ఈ ఘటనపై నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందిస్తూ నెట్టింట్లో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. నాగుల పంచమి నాడు శుభాకాంక్షలు చెప్పేందుకు పాము వచ్చి ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు సీఎంకు జంతువులు, వన్య మృగాలపై ప్రేమ ఉందని కొనియాడారు. ఆ పాము పిర్పిటి రకానికి చెందినదని దానికి విషం ఉండదని, ఎవరికీ హాని చేయదని సీఎం చెప్పారు. 

ఆసియా ఖండంలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయన్నారు. అరుదైన రకానికి చెందిన ఇలాంటి సరీసృపాలను కాపాడుకోవాలని సూచించారు.