కాలీ ఫ్లవర్లో కట్ల పాము..మీ కూరగాయలను పరిశీలించారా

కాలీ ఫ్లవర్లో కట్ల పాము..మీ కూరగాయలను పరిశీలించారా

సాధారణంగా కూరగాయల్లో చిన్న చిన్న పురుగులు కనిపించడం కామన్. కొన్ని కూరగాయల్లో..లైక్ కాలీఫ్లవర్, బ్రొక్కోలి వంటి వాటిల్లో చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా ఉంటుందని తెలుసు. కానీ కూరగాయల్లో పాములు తలదాచుకుంటాయని మీకు తెలుసా..? అవును ఈ మధ్య కూరగాయల్లో పురుగులే కాదు..పాములు తలదాచుకుంటున్నాయి. మీరు నమ్మరని మాకు తెలుసు..అందుకే వీడియోను సాక్ష్యంగా తీసుకొచ్చాం. 

2 నిమిషాల 19 సెకన్ల ఓ వీడియోలో ఓ పాము కాలీ ఫ్లవర్ లో దాక్కుంటుంది. అయితే కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకున్న మహిళ కాలీ ఫ్లవర్ కూడా కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చి కింద పోసింది. కాలీ ఫ్లవర్ లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దీంతో మెల్లగా కాలీ ఫ్లవర్ ను ఒక్కో ఫ్లవర్ తీస్తుండగా..అందులో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

ఈ వీడియో ట్విట్టర్ లో దేవేంద్ర సైనీ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. అయితే ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం అతను వెల్లడించలేదు. కాలీ ఫ్లవర్ లో కట్ల పాము రావడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో..లేదా కొనుగోలు చేసిన తర్వాత జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని చెబుతున్నారు.

కట్ల పాము డేంజరా..?
భారతదేశంలో ఉండే అత్యంత విషపూరితమైన పాముల్లో కట్లపాము ఒకటి.  నాగుపాము కంటే కూడా ఇది డేంజర్. ఈ పాము కాటు వేస్తే కొన్నిసార్లు పెద్దగా నొప్పి అనిపించదు. కాటేసిన చోట గాట్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి.  కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ఈ పాము విషం నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది.  నిద్రలో కరిస్తే కనిపెట్టకపోతే.. మరణం సంభవిస్తుంది. విషం రక్తంలోకి చేరకముందే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.