వీడియో: కేక్ కట్ చేసి పాములకు తినిపించిన స్నేక్ లవర్స్

వీడియో: కేక్ కట్ చేసి పాములకు తినిపించిన స్నేక్ లవర్స్

ఎక్కడైనా సరే బర్త్ డేనో, యానీవర్సరీ డేనో ఉంటే కేక్ కట్ చేసి చుట్టుపక్కల వాళ్లకు పెడతారు. కానీ.. కేక్ కట్ చేసి పాములకు తినిపించడం ఎక్కడైనా చూశారా? జార్ఖండ్ లో కొంతమంది అలాగే చేశారు. ప్రతి సంవత్సరం జూలై 16ను ప్రపంచ పాముల దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు సోషల్ మీడియా మొత్తం వివిధ రకాల పాములతో నిండిపోయింది. అలాగే ఒక విచిత్రమైన వీడియో కూడా దర్శనమిచ్చింది. అదేంటంటే.. జార్ఖండ్ కు చెందిన కొంతమంది స్నేక్ లవర్స్ ఆ రోజున కేక్ కట్ చేసి పాములకు తినిపించారు. ఆ వీడియోను విరాట్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్టు చేశారు. దాన్ని చూసిన చాలామంది విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసి రమేష్ పాండే, ప్రవీణ్ కశ్వాన్ సాకేత్ బడోలా లాంటి ఐఎఫ్ఎస్ లు కూడా స్పందించారు.

విరాట్ సింగ్ ఈ వీడియోకు కొంతమంది ఐఎఫ్ఎస్ లను ట్యాగ్ చేస్తూ.. ‘వరల్డ్‌ స్నేక్ డే రోజున వారంతా కేక్ కట్ చేసి.. కొంచెం కేక్ పాములకు కూడా తినిపించి.. చాలా సంతోషంగా ఫీలయ్యారు. అటువంటి వాళ్ల నుంచి పాములను రక్షించినట్లయితే పాముల మునగడకే ప్రమాదం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయింది’ అని ట్వీట్ చేశారు. చాలామంది ఐఎఫ్ఎస్ లు దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తే.. ఈ వీడియోను పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని ఐఎఫ్ఎస్ సాకేత్ బడోలా హెచ్చరించారు. అటువంటి వారికి పాముల పట్ల అవేర్ నెస్ కల్పించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

For More News..

కరోనా పేషంట్ పై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

పైలట్ వర్గానికి ఊరటనిచ్చిన రాజస్థాన్ హైకోర్టు

లవర్ కోసం నడుస్తూ పాక్ బార్డర్ చేరిన యువకుడు