నాగ చైతన్య ఇష్యూపై క్లారిటీ.. లైఫ్ పాట్నర్ అలా ఉండాలి

నాగ చైతన్య ఇష్యూపై క్లారిటీ.. లైఫ్ పాట్నర్ అలా ఉండాలి

వైజాగ్​ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala) తాజాగా ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ చేసింది. తనను అభిమానించే వారు తన నటన గురించి మాట్లాడాలని అంతే కానీ  వ్యక్తిగత జీవితంపై  వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. ఇటీవల నాగచైతన్య(Naga chaitanya)తో రిలేషన్​లో ఉందంటూ శోభితపై రూమర్స్​ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి రూమర్లను పట్టించుకోనని ఈ బ్యూటీ ఇండైరెక్ట్​గా తెలిపింది. 

‘కొన్ని సార్లు బయటకు మాట్లాడకపోతే చాలా విషయాలు తెలుసుకునే అవకాశమే ఉండదు. అందుకే చెప్పున్నా.. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. నా ప్రతిభ, శ్రమ ఆధారంగానే ఎవరైనా నన్ను గుర్తించాలని కోరుకుంటాను. నా పర్సనల్​ లైఫ్​పై చేసే వ్యాఖ్యలు పట్టించుకోను’అని తెలిపింది. ఇక తన జీవిత భాగస్వామి క్వాలిటీస్​ గురించి ప్రస్తావిస్తూ.. ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉండి, అర్థం చేసుకునే వాడైతే చాలని తెలిపింది.