కేంద్ర బడ్జెట్‪పై మీమ్స్‌తో ట్రోల్

కేంద్ర బడ్జెట్‪పై మీమ్స్‌తో ట్రోల్

ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ 2023ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పై దేశ ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2023పై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ట్రోలర్స్  చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా పిక్చర్ రూపంలో చూపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

బడ్జెట్ అనగానే మధ్య తరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయోనన్న టెన్షన్ మొదలవుతుంది. ఈసారైనా భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి కొంచెమైనా ఉపశమనం కలిగిస్తారా అన్న సంశయంలో ఉండే జనాల పరిస్థితికి ఈ మీమ్  అద్దం పడుతోంది. 

బడ్జెట్​లో ఉపయోగించే భాష సాధారణంగా సామాన్య ప్రజలకు సరిగ్గా అర్థమవ్వదు. ముఖ్యంగా ట్యాక్స్​ టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్థమయ్యేలా చెప్పడంటూ తెలిపే మీమ్​ ఇది.

నేను కూడా మధ్య తరగతికి చెందిన మనిషినే.. ఆ బాధ నాక్కూడా తెలుసు అంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రియేట్ చేసిన సెటైరిక్ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏ వస్తువు ఆర్డ్​ చేసినా.. నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ జొమాటో, బ్లింకిట్​ చెబుతుంటే.. ‘ఏ వస్తువును కొనుగోలు చేసినా.. దానిపై జీఎస్టీ విధిస్తాం’ అని కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా ఈ మీమ్ అందరినీ  ఆకట్టుకుంటోంది

బడ్జెట్ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్ ఇది. బడ్జెట్ ఎలా ఉన్నా.. అధికారపక్షం దాన్ని సూపర్ అని ప్రశంసిస్తుంది. విపక్షాలు దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తాయి. ఇదే మీనింగ్ తో క్రియేట్ చేసిన ఈ మీమ్ ఈ సారి కూడా ట్రెండింగ్ లో నిలిచింది.