డాక్టర్ను దూషించానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు

డాక్టర్ను దూషించానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు

వైద్యులతో పాటు వైద్య సిబ్బందిని తానెప్పుడు గౌరవిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. అగస్ట్ 19న జమ్మిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ ను దూషించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

‘‘స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పండ్ల పంపిణీ కార్యక్రమానికి జమ్మిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ కౌశిక్ ను కూడా పండ్ల పంపిణీ చేయడానికి ఆహ్వానించాను. కౌశిక్ నెల రోజుల క్రితమే విధుల్లో చేరారు. పేషంట్స్ సహా ఆస్పత్రి స్టాఫ్ తో అతని ప్రవర్తన సరిగ్గాలేదని నాకు కొందరు చెప్పారు. ఆ విషయంపై డీఎంహెచ్వో కు పిర్యాదు చేశా. అంతేగాని అతడని నేను దూషించలేదు. కొందరు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సుభాష్ రెడ్డి  తెలిపారు.