జ్యోతిష్యం: అప్పుల బాధలు.. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పరిష్కార మార్గాలు ఇవే !

జ్యోతిష్యం:   అప్పుల బాధలు.. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పరిష్కార మార్గాలు ఇవే !

జీవితం అంటేనే సమస్యలు ఉంటాయి.  చాలామందికి భరించలేని ఇబ్బందులతో సతమతవుతుంటారు.  గ్రహాలు అనుకూలించకపోవడం.. వాస్తు సరిగా ఉండకపోవడం ..ఇలా అనేక సమస్యలు వేధిస్తుంటాయి.  జ్యోతిష్యం ప్రకారం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు  శాస్త్రం ద్వారా పరిష్కారాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.  వివిధ రకాల సమస్యలకు, గ్రహ దోషాలకు, వాస్తు దోషాలకు, ఇతర సమస్యలకు పరిహారాలు మార్గాలను  చూద్దాం. . .

అనవసర వ్యయాలు, అప్పుల బాధలు: అనవసరంగా వ్యయం పెరిగి, అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటే, ఉదయం  రావిచెట్టుకు నీరు పోస్తుండాలి.  అలాగే  రాత్రి శివాలయం దర్శనం చేసుకోవాలి.ఇలా  కంటిన్యూగా చేస్తుంటే ఆర్థిక ఇబ్బందులు క్రమేణా తగ్గుతాయి.  

పనుల్లో సంధిగ్దతలు :  చాలామందికి వారు తలపెట్టిన పనుల్లో అనవసరంగా ఆందోళనలు.. సందిగ్దతలు ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యతో సతమతమయ్యే వారు .. శివాలయంలోని  నవగ్రహాల దగ్గర తమలపాకులపై ప్రమిద ఉంచి, అందులో దీపారాధన చేయాలి.

తరచూ గొడవలు, శత్రు బాధలు : కొంతమంది  అనవసరంగా గొడవలతో ఇబ్బంది పడతారు.  శత్రువులు వేధిస్తుంటారు.  అలాంటి వారు  ఓం అగ్ని రూపాయం హ్రీం నమః అనే మంత్రాన్ని  11 రోజులపాటే 1,116 సార్లు జపం చేయాలి.  ఆ తర్వాత 41 రోజుల పాటు 108 సార్లు జపం చేయాలి. 

ఇంట్లో వారికి  అనారోగ్యం:  ఇంట్లో ఎప్పుడూ.. ఎవరో ఒకరు అనారోగ్యానికి  గురవుతుంటే మనశ్శాంతి ఉండదు.  ఆరోగ్య సమస్యలు పరిష్కారమవ్వాలంటే  బంధువులు వచ్చినప్పుడు, ఇంటి సభ్యుల సంఖ్య, వచ్చిన బంధువుల సంఖ్య కలిపి, దానికి మరొకటి అదనంగా చపాతీలు చేసి కుక్కలకు వేయాలి. ఉదాహరణకు ఇంట్లో 4 మంది ఉండి, ముగ్గురు బంధువులు వస్తే, 4+3+1=8 చపాతీలు కుక్కలకు వేయాలి.

Also Read:-ఆనందం, ఆవేదన, కర్తవ్యం ఈ మూడింటికి తేడా ఏంటీ తెలుసుకోండి..!

ట్రాన్సఫర్ కావాలనుకుంటే:  సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి, శుచిగా సూర్యునికి 21 మిరప విత్తులు నైవేద్యం పెట్టి, ట్రాన్సఫర్ కావలసిన విషయం గురించి చెప్పి, “ఓం అరుణాయ నమః” అనే నామాన్ని యథాశక్తి జపిస్తూ ఉండాలి.  ఆదివారం నుంచి  మరల ఆదివారం  వచ్చే వరకూ ఇలా చేస్తూ ఉండాలి.

 ఆడపిల్లలకు వివాహం ఆలస్యం అవుతుంటే  :కాలసర్ప దోషం ఉంటే వివాహంలో ఆటంకాలు కలుగుతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు..  మంగళవారం నాడు జంట నాగుల దగ్గర పసుపు, వరిపేలాలు వేసి, నమస్కారం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి.

వ్యాపారాభివృద్ధి : దుకాణంలో సామాను అమ్ముడు పోవడానికి అమవాస్య నాడు పొట్టు తీయని మినుములు ( పావు కేజీ) కాళికామాత ఆలయంలో ఇచ్చి పూజ చేయించుకుని, వాటిని తిరిగి తెచ్చుకోవాలి. మర్నాడు వాటిని షాపు ఊడ్చిన తర్వాత షాపులో చల్లాలి.  దుకాణం మూసేసిన తర్వాత రెండు వైపులా... కర్పూరం వెలిగించి, నల్లటి గుడ్డతో దిష్టి తీయాలి.