తమ తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతున్నారని 13 ఏండ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది. పట్టణంలోని రహీంపురా కు చెందిన రవి, అపర్ణ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే తన పేరెంట్స్ ఎప్పుడూ గొవడం పడటం విరాట్(13)కు నచ్చేది కాదు. పలు సార్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేక పోవడంతో తనలో తానే మదనపడేవాడు.
ఎప్పటిలాగే నవంబర్ 22న సాయంత్రం విరాట్ తల్లిదండ్రులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఇకపై గొడవలు ఆపకుంటే తాను చనిపోతానని ఆ బాలుడు తన తల్లిదండ్రులను హెచ్చరించాడు. తాను భవిష్య త్తులో ఏమీ చేసుకోకుండా ఉండాలంటే గొడవ పడమని సంతకం చేయాలని ఒక కాగితంపై రాసి ఇచ్చాడు. దానిపై తండ్రి సంతకం చేశాడు. తల్లి ఆలోచనలో పడగా.. ఇంతలోనే పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
