
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగింది. తండ్రి చనిపోయిన కొద్ది గంటల్లోనే కుమారుడూ గుండెపోటుతో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలని మానకొండూరు మండలం మద్దికుంట గ్రామానికి చెందిన సంధ కొమురయ్య ( 75 ) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అతడి పెద్ద కుమారుడు కొమురయ్య (45) శవం దగ్గరే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూశాడు. కొమురయ్యకు ఇద్దరు కుమారులు. తండ్రి శవం దగ్గరే కొడుకు విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.