ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్– చల్వాయి గ్రామాల మధ్య 163 హైవేపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో కొడుకు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన నానవరపు సందీప్ (30), అతడి తల్లి రాణి, ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి ములుగు వైపు నుంచి కమలాపురం వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌‌‌‌ను ఢీకొట్టారు. 

ప్రమాదంలో సందీప్ స్పాట్​లోనే మృతి చెందగా, తల్లి రాణి తలకు తీవ్ర గాయాలు కాగా, బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 లో ములుగు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాణి పరిస్థితి విషమంగా ఉండండతో అక్కడి వైద్యులు ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు.