జమ్మికుంట, వెలుగు : అల్లుడు అనారోగ్యంతో చనిపోగా.. అతడి మరణం తట్టుకోలేని అత్త గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఇల్లందకుంట గ్రామానికి చెందిన బూర్ల రంజిత్(36) కొత్తపల్లిలో ఉంటున్నాడు. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం మందుల కోసమని మెడికల్ షాప్ కు వెళ్లగా... అక్కడే పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న అతడి అత్త గుండేటి పద్మ (56) ఘటనాస్థలానికి చేరుకొని రంజిత్ పై పడి ఏడుస్తూ గుండెపోటుతో కుప్పకూలి
చనిపోయింది.
