సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్?

సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్?

కుటుంబ సభ్యుల ఆరోపణ
డీల్​ వివరాలతో లెటర్​ వచ్చిందని వెల్లడి

హిసార్ : బీజేపీ హర్యానా లీడర్​ సోనాలీ ఫొగట్​ హత్య కేసులో కుట్ర జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోనాలీని చంపేందుకు రూ.10 కోట్లతో డీల్​ జరిగిందని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు లెటర్​ వచ్చిందని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో రెండు లెటర్లు వచ్చాయని, ఒక దాంట్లో ఈ డీల్ గురించి ఉందని వివరించారు. ఇటీవలే అందుకున్న మరో లెటర్​లో పలువురు రాజకీయ నేతల పేర్లు ఉన్నాయని సోనాలీ మరిది అమన్ పూనియా తెలిపారు. సోనాలీ హత్య కేసులో వారి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

తమకు అందిన రెండు లెటర్లను పోలీసులకు అందజేశామని పూనియా చెప్పారు. ఈ లెటర్ల ఆధారంగా సోనాలీ హత్య వెనక ఉన్న కుట్రను ఛేదించాలని, హంతకులను పట్టుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, ఆమ్​ఆద్మీ పార్టీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పూనియా తేల్చిచెప్పారు. సోనాలీతో పాటు తమ కుటుంబం మొత్తం బీజేపీలోనే ఉందని తేల్చిచెప్పారు. సోనాలీ సోదరి రుకేశ్​వచ్చే ఎన్నికల్లో ఆదంపూర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.