- విద్యావ్యవస్థలో భారీ మార్పులు కావాలి
- ఇది జెడ్ జెడ్ విజయం అని ప్రశంస:వాంగ్ చుక్
- విద్యావవస్థలో మార్పులపై కేంద్రం దృష్టిపెట్టాలన్న వాంగ్ చుక్
Gen Z యువత డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడంతో నిరాహార దీక్ష విరమించారు సోనమ్ వాంగ్ చుక్. జెన్ జెడ్ విజయంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద విజయం అన్నారు. ఈ పరిణామంతో న్యూ ఇండియాకు తొలి అడుగు పడిందన్నారు. ఇక విద్యావ్యవస్థలో భారీగా ప్రక్షాళన జరగాల్సి ఉంది.. కేంద్ర ప్రభుత్వం ఆదిశగా దృష్టి పెడుతుందని ఆశిస్తున్నామన్నారు సోనమ్ వాంగ్ చుక్.
అంతకుముందుకు జెన్ జెడ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు సోనమ్ వాంగ్ చుక్. నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. యువత హింసకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు నెల రోజుల పాటు సాగిన జెన్ జెడ్ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గి వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది. ప్రధాన డిమాండ్లలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు , చనిపోయిన విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం, జెన్ జెడ్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై దేశవ్యాప్తంగా ఉన్న కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించింది.
కేంద్ర ప్రభుత్వం జెడ్ జెడ్ డిమాండ్లకు అంగీకరించడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ తో పాటు దేశవ్యాప్తంగా యువత సంబురాలు చేసుకున్నారు. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ చేపట్టేందుకు పోలీసు అనుమతి తీసుకున్నారు. పలువురు రాజకీయ సిని ప్రముఖులు న్యూఇండియాకు తొలి అడుగు పడిందని అన్నారు. జెడ జెడ్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. కేంద్ర మెడలు వంచి విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకున్నారని అన్నారు.
