బంగారం లాంటి భారతదేశాన్ని నాశనం చేసిన బీజేపీ.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను బంగారం చేస్తానని వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారం కోసం పోటీ పడుతున్న తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకదానికిపై మరొకటి ఆరోపణలకు పాల్పడుతున్నాయి.
కోల్‌కతాలో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు మమత బెనర్జీ. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని, ఆ స్థానాన్ని మరే పార్టీ తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ధి శూన్యమంటూ మమత ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించగా..బీజేపీ దేశాన్ని అమ్మకానికి పెట్టిందంటూ ఆ విమర్శలను తిప్పికొట్టారు మమత.