సోనియాగాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు పండుగ: రేవంత్ రెడ్డి

సోనియాగాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు పండుగ: రేవంత్ రెడ్డి

సోనియాగాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గాంధీ భవన్ లో జరిగిన సోనియా బర్త్ డే వేడుకల్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..  సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు.  సోనియా గాంధీ 60 ఏళ్ల కల నెరవేర్చిందన్నారు.   ఎన్నో ఆటంకాలు,అడ్డంకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.   కార్యకర్తల కష్టం,త్యాగంతోనే  అధికారంలోకి వచ్చామన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని..వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు రేవంత్

 గాంధీ భవన్ లో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పలువురు కాంగ్రెస్ నేతలు  పాల్గొన్నారు. సోనియా 78 వ బర్త్ డే సందర్భంగా 78 కిలోల భారీ కేక్ ను  కట్ చేశారు. దీంతో గాంధీ భవన్ సందడిగా మారింది.