న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. గతేడాది డిసెంబర్ లో 79 ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైద్య పరీక్షల కోసం మేదాంత ఆసుపత్రికి వెళ్లారు.
పరీక్షల అనంతరం ఆమె ఇంటికి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు మార్చిలో ఆమె తీవ్ర జ్వరంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకినట్లు పరీక్షల్లో తేలడంతో వైద్యులు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు.
