
రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. షాద్ నగర్ లో ఏప్రిల్ 8వ తేదీన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై ఓ ముఠా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి లక్షా 13వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.