వరల్డ్ కప్: బంగ్లాకు బుల్లెట్ బిగినింగ్.. సౌతాఫ్రికాతో మ్యాచ్

వరల్డ్ కప్: బంగ్లాకు బుల్లెట్ బిగినింగ్.. సౌతాఫ్రికాతో మ్యాచ్

లండన్ : వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా  కెన్నింగ్టన్ ఓవల్ లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా… ఫీల్డింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఓపెనర్లు.. తమ జట్టుకు బుల్లెట్ ఓపెనింగ్ ఇచ్చారు. దాదాపు ఏడు రన్ రేట్ తో పరుగులు సాధించారు.  బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్.. సఫారీ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 7 ఓవర్లలోనే 50 రన్స్ దాటింది బంగ్లా స్కోరు. ఇన్నింగ్స్ స్కోరు 60 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 16 రన్స్ చేసి ఫెలుక్వాయో బౌలింగ్ లో ఔటయ్యాడు.

మే 30న వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడిన సౌతాఫ్రికా.. ఆ మ్యాచ్ లో ఓడిపోయింది.