హైదరాబాద్: కరోనాపై పోరాటంలో ఫండ్ రైజింగ్ కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షల్ గిబ్స్ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా తన బ్యాట్ ను వేలం వేయాలని గిబ్స్ నిర్ణయించాడు. జొహన్నెస్ బర్గ్ లో 2006లో ఆస్ట్రేలియాపై 434 రన్స్ ఛేదనలో గిబ్స్ (175 ) అద్భుత ఇన్నింగ్స్ తో చెలరేగడంతో సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో 438 రన్స్ చేసి రికార్డు బ్రేకింగ్ విక్టరీ సాధించింది. ఇప్పుడు ఆ ఇన్నింగ్స్ లో తాను వాడిన బ్యాట్ ను వేలం వేయనున్నట్లు గిబ్స్ ట్వీట్ చేశాడు. ఆ బ్యాట్ ను ఇన్ని రోజులు భద్రంగా దాచుకున్నానని తెలిపాడు. బ్యాటు అమ్మకం ద్వారా వచ్చే నిధులను కరోనాపై పోరుకు ఫండ్ గా ఇవ్వనున్నట్లు చెప్పాడు.
రీసెంట్ గా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కూడా గుజరాత్ లయన్స్ పై తమ జోడీ బాదిన 226 రన్స్ ఇన్నింగ్స్ లో వాడిన వస్తువులను కరోనా ఫండ్ రైజింగ్ కోసం వేలం వేయనున్నట్లు ప్రకటించారు. బంగ్లా సీనియర్ క్రికెటర్లు షకిబల్ హసన్, ముష్ఫికర్ రహీం కూడా తమ బ్యాట్ లను మహమ్మారిపై పోరుకు వేలం వేస్తామని తెలిపారు.
Supersport showing the #438 game . The bat i used that day will be up for auction to raise funds for covid. Kept it all these years. pic.twitter.com/VyGyAzKVSn
— Herschelle Gibbs (@hershybru) May 1, 2020

