హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈనెల 28, 29వ తేదీల్లో మొత్తం 28 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
స్పెషల్ ట్రైన్స్ నడిచే రూట్స్ ఇవే:
సికింద్రాబాద్ టు మంచిర్యాల్, మంచిర్యాల్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్, నిజామాబాద్ టు వరంగల్, వరంగల్ టు నిజామాబాద్, కాజిపేట్ టు ఖమ్మం, ఖమ్మం టూ కాజీపేట, ఆదిలాబాద్ టు కాజీపేట, కాజీపేట టు ఆదిలాబాద్ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. మేడారం భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
►ALSO READ | హైదరాబాద్ లో మహిమ గల క్షేత్రం.. తాడ్ బండ్ వీరాంజనేయుడు.. త్రేతాయుగం నుంచి పూజలు
కాగా, 2026, జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
