హైదరాబాద్ లో మహిమ గల క్షేత్రం.. తాడ్ బండ్ వీరాంజనేయుడు.. త్రేతాయుగం నుంచి పూజలు

హైదరాబాద్ లో మహిమ గల క్షేత్రం.. తాడ్ బండ్ వీరాంజనేయుడు.. త్రేతాయుగం నుంచి పూజలు

 తాడుబందు వీరాంజనేయుడు.. త్రేతాయుగంలో ఇక్కడ స్వయంభుగా ఆవిర్భవించినట్టు స్థల పురాణం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ కొలువుదీరినట్టు చెబుతారు. నిత్య పూజలు అందుకుంటున్న ఇక్కడి స్వామి వారిని కొలిస్తే.. ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం ఉన్న ఈ ప్రాంతాన్ని 'తాడ్​ బండ్' అని కూడా పిలు స్తారు. త్రేతాయుగంలో జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు ప్రత్యక్షమైనట్టు చెబుతారు. అందుకే జాబాలి మహర్షి ఇక్కడ వీ రాంజనేయస్వామిని ప్రతిష్టించినట్టు చెబుతారు. తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలుగకుం డా చూడమని వినాయకుడిని మహర్షి ప్రార్థించా డట. అందువల్ల ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుం టాడు.

 19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి... తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవా సుల సహాయంతో నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ట చేశాడు. అప్పటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతున్నాయి.

ఆలయ ప్రత్యేకతలు

తాడుబందు వీరాంజనేయ ఆలయంలో హనుమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై కనిపిస్తాయి. అవి ఏంటంటే.. 'నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్చితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. 

ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. అయితే, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగుతాడు. సువర్చల మాత్రం స్వామివారి ధ్యానంలోనే శేష జీవితాన్ని గడుపుతుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ కనిపిస్తాయి. మొగలులు, రాజ పుత్రులు, కుతుబ్ షాహీలు ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రఉంది..

ప్రతి రోజు వందలాది మంది భక్తులు తాడుబందు ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మంగళ, శని వారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ. నలభై రోజుల పాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

అద్భుత నిర్మాణం

దేవాలయంలోని గర్భగుడి మొత్తం గ్రానైట్ నిర్మించారు. ముఖ మండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపు రాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం సత్రాలు, భోజనశాలలు కూడా ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం కూడా ఉంది..

ఎలా వెళ్లాలి:

సికింద్రాబాద్ బోయినపల్లి సమీపంలోని సిక్ విలేజ్ లో తాడ్​ బండ్​  వీరాంజనేయ ఆలయం ఉంది. సికింద్రాబాద్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం. 26 ఎస్ నెంబర్ బస్సు లేదంటే ఆటోల్లో వెళ్లొచ్చు.

–వెలుగు,లైఫ్​‌–