మార్చి 31 నాటికి చర్లపల్లి టెర్మినల్ పూర్తి : రైల్వే జీఎం అరుణ్ కుమార్

మార్చి 31 నాటికి చర్లపల్లి టెర్మినల్ పూర్తి : రైల్వే జీఎం అరుణ్ కుమార్
  • దక్షిణ మధ్య రైల్వే జీఎం

హైదరాబాద్, వెలుగు : చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చివరి దశకు చేరుకున్నాయని.. మార్చి 31 వరకు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. టెర్మినల్ బయట అప్రొచ్ రోడ్ నిర్మించాల్సి ఉందని చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్ విస్తరణ పనులు కూడా జెట్ ​స్పీడ్​తో జరుగుతున్నాయని తెలిపారు. గురువారం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్​ ప్రవేశపెట్టిన తర్వాత రైల్వే కేటాయింపులపై రైల్ నిలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణ ప్రాజెక్టుకు రాష్ట్రం ప్రభుత్వం 2/3 వాటా నిధులు ఇవ్వాల్సి ఉందని, ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించాక ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వట్టి నాగులపల్లి రైల్వే టెర్మినల్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎంఎంటీఎస్​లో ప్యాసింజర్లు తగ్గారని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ప్రాజెక్టు పూర్తయిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు రూ.381 కోట్లు ఇస్తే ట్రైన్ కోచ్ లకు ఆర్డర్ ఇస్తామన్నారు.