
తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దసరా. ఈ పండగకు ప్రజలంతా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఎక్కడ ఉన్నా సరే..దసరా పండగను సొంత ఊర్లలో జరుపుకోవాలనుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా దసరాకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
దసరాకు ప్రత్యేక రైళ్లు
- అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైలును నడవవనుంది. రైలు రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వరకు నడవనుంది.
- అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు సికింద్రాబాద్ నుంచి -దానాపూర్ వరకు ప్రత్యేక రైలు నడవనుంది.
- అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు బీహార్ లోని దానాపూర్ నుంచి -సికింద్రాబాద్ వరకు ఈ రైలు సర్వీస్ సేవలు అందించనుంది.
ALSO READ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
- అక్టోబరు 2 నుంచి డిసెంబరు 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో పాట్నా- నుంచి సికింద్రాబాద్ వరకు ఒక రైలు.. అక్టోబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు ప్రతి బుధవారం హైదరాబాద్ నుంచి -పాట్నాకు మరో స్పెషల్ ట్రైన్ నడవనుంది. -
- అక్టోబరు 6 నుంచి డిసెంబరు 8 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి -పాట్నా వరకు ప్రత్యేక రైలు నడవనుంది.
- సికింద్రాబాద్- విశాఖపట్నం రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.