
- సీఎం రేవంత్‌ను కలిసిన రాజకీయ విశ్లేషకుడు ఇనుగంటి రవికుమార్
హైదరాబాద్, వెలుగు: జనాభా లేదా ప్రొరేటా ప్రకారం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసు కుని డీలిమిటేషన్ చేసినా లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% నుంచి 19 % వరకు తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుడు ఇనుగంటి రవికుమార్ అన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి డీలిమిటేషన్ ప్రక్రియపై వివరించారు.
ఏపీ విభ జన చట్టంలో తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు, ఏపీలో 50 సీట్లు పెంచాలని పేర్కొన్నా.. 2026 దాకా పెంచే అవకాశం లేదని, ఆర్టికల్ 170 అందుకు ఒప్పుకోదని కేంద్రం పార్లమెంట్లో పదేపదే చెప్పిందని గుర్తుచేశారు. జమ్మూకాశ్మీర్ లో 7 అసెంబ్లీ స్థానాలను విభజన బిల్లు ద్వారా కేంద్రం పెంచిందని గుర్తుచేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచకపోవడం వల్ల.. రెండు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రావాల్సిన 20 అసెంబ్లీ స్థానాలూ కోల్పోయారని సీఎంకు వివరించా రన్నారు. మరో 25 ఏండ్ల పాటు పార్ల మెంట్ స్థానాలను పెంచకుండా చూడాలని, దక్షిణాది రాష్ట్రాలో తెలంగాణ, ఏపీలు నష్టపోకుండా చూడాలని కోరినట్టు చెప్పారు.