రుతుపవనాల ఎఫెక్ట్.. మహారాష్ట్రలో భారీ వర్షాలు

రుతుపవనాల ఎఫెక్ట్.. మహారాష్ట్రలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వానలు ప్రారంభమయ్యాయి. ముంబయి దాని శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాలోని పలు ప్రాంతాల్లో నైరుతి పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని IMD అధికారి తెలిపారు. అరేబియా సముద్రం, దక్షిణ గుజరాత్, దక్షిణ మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, దక్షిణ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఆయా ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబయిలో వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోయిందని..ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ముంబయికి ఈనెల 11న రావాల్సిన నైరుతి పవనాలు రెండ్రోజులు ఆలస్యంగా వచ్చాయి.