దేశమంతా నైరుతి రుతుపవనాలు

దేశమంతా నైరుతి రుతుపవనాలు
  •     ఆరు రోజులు ముందే విస్తరణ
  •     జూన్‌లో 16 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. జరంత ఆలస్యంగా వచ్చినా.. విస్తరణలో మాత్రం వేగం చూపించాయి. ఆరు రోజులు ముందుగానే అన్ని ప్రాంతాలను కవర్ చేశాయి. నైరుతి పూర్తిగా విస్తరించే సాధారణ తేదీ జులై 8 కాగా, ఆదివారానికే దేశమంతా కవర్ చేశాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాస్త వేగంగా వెళ్లినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. జులైలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. జూన్‌లో 16 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైందని వివరించింది. 

సాధారణ వర్షపాతంతో పోలిస్తే.. బీహార్‌‌లో 69%, కేరళలో 60% డెఫిసిట్ ఉందని పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, ఏపీ, తెలంగాణలో తక్కువ వర్షపాతం కురిసిందని చెప్పింది. గత 25 ఏండ్లలో 16 ఏండ్లు జూన్‌లో తక్కువ వర్షపాతం, జులైలో సాధారణ వర్షపాతమే నమోదైందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు.