చెన్నై: సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది.. దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. భానుడి భగభగల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు చెన్నై వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తీరంలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు 2026, మే 16న అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరి, రామనాథపురం, శివగంగ, మదురై, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
►ALSO READ | బిగ్ అలర్ట్.. జూన్ 25 నుంచి తెలంగాణలో.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)
సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతియేటా జూన్ 1వ తేదీన దేశంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది కాస్తా ముందుగానే అంటే మే చివరి వారాల్లోనే నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీతో పాటు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేశాయి.
దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో 92 శాతం నుంచి 94 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. జూన్‌లో మొదలై సెప్టెంబర్ నెలలో రాజస్థాన్ గుండా నైరుతి రుతుపవనాలు వెనుదిరుగుతాయి.కాగా, గత నాలుగు నెలలుగా భానుడి భగభగలకు అల్లాడిపోయిన జనం నైరుతి రుతపవనాల రాకతో కురువనున్న వర్షాలతో సేద తీరనున్నారు.
