బిగ్ అలర్ట్.. జూన్ 25 నుంచి తెలంగాణలో.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)

బిగ్ అలర్ట్.. జూన్ 25 నుంచి తెలంగాణలో.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)
  • 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ  సర్ (SIR) 

దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)కు కేంద్ర ఎన్నికల్ సంఘం సిద్దమవుతోంది. 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర జాబితా ప్రత్యేక సవరణ (SIR)  నిర్వహించేందుకు రాష్ట్రావారీగా తేదీలను ప్రకటించింది. జనగణన, క్షేత్ర స్థాయిలో అధికారుల అందుబాటును దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల్లో సర్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.  తెలంగాణలో జూన్ 25, 2026 నుంచి జూలై 4,2026 వరకు నెలరోజుల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నారు. ముసాయిదా  ఓటర్ల జాబితాను జూలై31,2026న ప్రకటించనుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్1,2026న ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  

తెలంగాణలో మే 12నాటికి 3కోట్ల 39లక్షల 20వేల 705మంది ఓటర్లున్నారు.  తెలంగాణలో మొత్తం 35వేల 985 మంది బీఎల్ వోలు,25వేల 886 మంది బీఎల్ ఏలు సర్ మూడో దశ ప్రక్రియలో పాల్గొననున్నారు. 

మూడో దశ SIR కార్యక్రమం నిర్వహించబడే రాష్ట్రాలు:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్. 

కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రా నగర్ హవేలీ,డామన్ డయ్యూ, చండీగఢ్ ,జాతీయ రాజధాని ప్రాంతం (NCT ఆఫ్ ఢిల్లీ).

ఈ దశలో రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ స్థాయి ఏజెంట్ల (BLAల) సాయంతో 3.94 లక్షల బూత్ స్థాయి అధికారులు (BLOలు) 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేయనున్నారు.