సింక్ ఫీల్డ్ కప్ టోర్నీలో ప్రజ్ఞానంద విజయం

 సింక్ ఫీల్డ్ కప్ టోర్నీలో ప్రజ్ఞానంద విజయం

సెయింట్‌‌ లూయిస్‌‌ (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌ఫీల్డ్‌‌ కప్‌‌ టోర్నీలో విజయాల ఖాతా తెరిచాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌‌లో జావోఖిర్‌‌ సిందరోవ్‌‌ను 95 ఎత్తుల వద్ద ఓడించాడు. దాంతో ఒకటిన్నర పాయింట్లతో ప్రజ్ఞా సంయుక్తంగా టాప్‌‌లో కొనసాగుతున్నాడు. క్వీన్‌‌ పాన్‌‌ ఓపెనింగ్‌‌తో మొదలైన పోరులో ప్రజ్ఞానంద అద్భుతమైన ఆటతీరును చూపెట్టాడు. 

ఎండ్‌‌ గేమ్‌‌లో కూడా పట్టు వదలకుండా పోరాడాడు. సిందరోవ్‌‌కు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం చాన్స్‌‌ ఇవ్వకుండా విజయం సాధించాడు. 

ఇతర గేమ్‌‌ల్లో లెవోన్‌‌ అరోనియన్‌‌ (ఆర్మేనియా, 1.5).. విన్సెంట్‌‌ కీమర్‌‌ (జర్మనీ, 0.5)పై, మాక్సిమ్‌‌ వాచిర్‌‌ లాగ్రేవ్‌‌ (ఫ్రాన్స్‌‌, 1.5).. సావియన్‌‌ శామ్యూల్స్‌‌ (అమెరికా, 0.5)పై, వెస్టీ సో (అమెరికా, 1.5).. జోర్డెన్‌‌ వాన్‌‌ ఫోరెస్ట్‌‌ (నెదర్లాండ్స్‌‌, 0)పై గెలవగా, ఫ్యాబియానో కరువాన (అమెరికా).. అనిష్‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌) మధ్య జరిగిన గేమ్‌‌ డ్రా అయ్యింది. ఈ టోర్నీలో ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉన్నాయి