న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 13, 15, 17న ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌లు ఆడనున్నట్లు ప్రకటించింది. దాంతో ఇదే నెలలో ఇండియాలో పర్యటించాలనుకున్న బంగ్లాదేశ్ ఆశలకు గండి పడింది.
గతంలో బంగ్లాతో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ రాజకీయ అనిశ్చితి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు ఇరు దేశాల బోర్డులు ప్రకటించాయి.
అఫ్గానిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ తెలిపాడు.
