గాలె: ఇండియాతో జరగనున్న తొలి టెస్ట్‌కు శ్రీలంక టీమ్‌ను ప్రకటించారు. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ఎంపిక చేశారు. డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించిన ఆఫ్ స్పిన్నర్ కేశర నువాంత తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
దాదాపు మూడేళ్ల తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా టీమ్‌కు దూరం కావడంతో డిక్వెల్లాకు అవకాశం లభించింది. అన్‌క్యాప్డ్ బ్యాటర్ పాసిందు సూరియబండార, లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుషంక చోటు దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్ కోసం లంక బోర్డు నలుగురు స్పెషలిస్ట్ పేసర్లను ఎంపిక చేసింది. గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం నుంచి తొలి టెస్ట్ జరగనుంది.
శ్రీలంక టెస్ట్ జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), లాహిరు ఉడాన, నిశాన్ మధుషక, కమింద్ మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండిమల్, పాసిందు సూరియబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, రమేశ్ మెండిస్, ప్రభాత్ జయసూరియా, కేశర నువాంత, మిలాన్ రత్నాయకే, అషితా ఫెర్నాండో, లాహిరు కుమార, విశ్వా ఫెర్నాండో, దిల్షాన్ మధుషంక.
