వాహనదారులు నడుపుతున్నప్పుడు.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి

వాహనదారులు నడుపుతున్నప్పుడు.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు :  వాహనదారులు బైక్​ నడుపుతున్నప్పుడు హెల్మెట్, ఫోర్​ వీలర్​ నడుపుతున్న వారు సీల్డ్​ బెల్ట్​ తప్పనిసరిగా పెట్టుకోవాలని మహబూబ్​నగర్​ ఎస్పీ డి.జానకి సూచించారు. ప్రతీ పోలీసు విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, వ్యక్తిగత ప్రయాణాల్లో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దీని వల్ల పోలీసుల ప్రవర్తనే ప్రజలకు మార్గదర్శకం అవుతుందన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడొద్దని, విధుల్లో అలర్ట్ గా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని ఎస్పీ చెప్పారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ ఎన్ బి రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్​బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు 
పాల్గొన్నారు.