గద్వాల, వెలుగు: ఈనెల 23 నుంచి 30 వరకు ప్రతి మండలంలో విత్తన మేళాలను నిర్వహిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో రెండు రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాల్లో సంబంధిత విత్తన అధికృత డీలర్లు వివిధ రకాల విత్తనాలను విక్రయిస్తారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీటీ 5204, ఆర్ ఎన్ ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీ ఎల్ 44 రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. కందులు, మినుములు, పెసర్లు, నువ్వులు, పత్తి, మిరప తో పాటు వివిధ రకాల కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీలను తక్కువ ధరకే రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
