మహబూబ్ నగర్ అర్బన్/మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని లాల్య నాయక్ తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి, అలాగే హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో రూ.10 లక్షలతో చేపట్టనున్న స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ భవనానికి వారు శంకుస్థాపన చేశారు.
వెంకటమ్మకుంట తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని ప్రారంభించారు. లాల్య నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. రాంనాయక్ తండాలో సర్పంచ్ రత్లావత్ జ్యోతి రవి నాయక్ తన సొంత హామీ మేరకు ముగ్గురు ఆడపిల్లల తల్లులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని, పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థిని తనుశ్రీకి రూ.5,500 విలువైన చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
