తెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఘాటుగా విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ పోచారం సస్పెండ్ చేయడంపై స్వామిగౌడ్ స్పందించారు. తెలంగాణ ద్రోహి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మరో తెలంగాణ ద్రోహి స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఆ తీర్మానాన్ని ఆమోందించారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సంతకం చేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీకి స్కీకర్గా ఉండటం దౌర్భాగ్యమన్నారు.

నాడు బచ్చాగాడివంటూ కేటీఆర్ ను నానా బూతులు తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ రోజు మంత్రిగా ఉండటం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని, ఆ భయంతోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని అసెంబ్లీలో ప్రకటించారన్నారు. సీఎం కాగానే కేసీఆర్.. ప్రతిపక్షాలు, ఉద్యమ నాయకుల గొంతు నొక్కడానికి ప్రయత్నించారని, అందులో భాగంగా ధర్నా చౌక్ ను ఎత్తేసారని ఆరోపించారు. ఇప్పడు అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం:

‘గని’ ట్రైలర్ వచ్చేసింది

స్వామీజీ ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు