రైతులు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు : ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

రైతులు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు : ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
  • ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు /వెంకటాపూర్ వెలుగు: అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం తడిసిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందన్నారు. అనుకొని పరిస్థితుల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 

క్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, సంబంధిత శాఖల అధికారులు, డీఆర్‌‌‌‌డీవోలు, డీసీవోలు, జీసీసీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జిలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం జిల్లా సివిల్ సప్లయ్స్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 93474 16178 ను సంప్రదించాలని పేర్కొన్నారు.