యూట్యూబర్... ఎంటర్​టైన్​మెంట్ ఇంజినీర్!

యూట్యూబర్... ఎంటర్​టైన్​మెంట్ ఇంజినీర్!

ఒక చిన్న ఆలోచన... దాన్ని అమలు చేయడానికి ఒక ప్లాట్​ఫాం... ఈ రెండు అంశాలే ఒక వ్యక్తి సక్సెస్​కి కారణం. ఇండియాలో మోస్ట్​ సక్సెస్​ ఫుల్​ యూట్యూబర్స్​లో ఒకడైన అరునభ్ కుమార్​​​​ విజయానికి కూడా ఇవే మెయిన్​ పిల్లర్స్. ఆలోచనే పెట్టుబడిగా, దాన్ని అమలు చేయడానికి యూట్యూబ్​ అనే ప్లాట్ ఫాం వాడుకున్నాడు. వెరైటీ కాన్సెప్ట్​లతో ఎంటర్​టైన్ చేస్తూ నెటిజన్స్​కు దగ్గరయ్యాడు. ​ఇప్పుడు స్టార్ యూట్యూబర్స్​లో ఒకడిగా నిలిచాడు. అరునభ్​ సక్సెస్​ వెనకున్న స్టోరీ ఇది...

యూట్యూబ్​ ఛానెల్స్​లో ఒక్కొక్కళ్లు ఒక్కో థీమ్​తో వీడియోలు చేస్తుంటారు. కానీ వాళ్లలో కొందరే ఫేమస్​ అవుతారు. సమ్​థింగ్ స్పెషల్ అనిపించుకుంటారు. అరునభ్ కూడా అంతే... ఇంజినీర్​ అవ్వాలనుకుని.. అమెరికాలో ఎయిర్​ ఫోర్స్​లో జాబ్​ చేసి, అటు నుంచి యూటర్న్​ తీసుకుని టీవీఎఫ్ (ది వైరల్ ఫీవర్)​ నెట్​వర్క్​ పెట్టాడు. మొదట ఎన్నో ఒడిదుడుకులు... వాటన్నింటినీ దాటి ఇప్పుడు సక్సెస్​ ఫుల్​ సిరీస్ కో– రైటర్, ఫౌండర్, ది వైరల్​ ఫీవర్​ మీడియా ల్యాబ్స్​ కంపెనీకి క్రియేటివ్​ ఎక్స్​పరిమెంట్ ఆఫీసర్ వంటి రకరకాల రోల్స్ లైఫ్​ ఎంజాయ్​ చేస్తున్నాడు అరునభ్​. 
‘‘చాలామందిలాగే నేను​ కూడా ఐఐటి చేసి, ఒక మంచి ఇంజినీర్​ కావాలని కల కనేవాడిని. అయితే చిన్నప్పటి నుంచి దూరదర్శన్​లో వచ్చే టీవీ ప్రోగ్రామ్స్ చూడటం అలవాటు నాకు. అప్పట్లో డీడీ, ముల్లా నస్రుద్దీన్​, మంగేరిలాల్ కె హసీన్ సప్నే వంటి ప్రోగ్రామ్స్​ చూసేవాడిని. అయితే, అవేవీ నన్ను ఇన్​స్పైర్​ చేయలేదు. అలా టీవీ చూడటం ఎంజాయ్​మెంట్​గా ఉండేది చాలాకాలం. కానీ, మా ఇంట్లో వాళ్లెవరికీ టీవీ ఇష్టం ఉండేది కాదు. నేను టీవీ చూసేవాడ్నే కానీ, నా డ్రీమ్​ మాత్రం ఇంజినీర్​ అవ్వాలనే ఉండేది. అదే ఆలోచనతో ఐఐటిలో చేరా. కానీ, ఐఐటి చేయడానికి వెళ్లిన నేను సినిమాలు, మూవీ మేకింగ్ గురించి తెలుసుకోవడంపై ఇంట్రెస్ట్ పెట్టా. దాంతో అనుకోకుండా నా లైఫ్​ టర్న్​ అయింది.అప్పుడు మెల్లగా నాకు అర్థమైన విషయమేంటంటే... నా ఇంట్రెస్ట్​ ఇంజినీర్ కాదు. సినిమాలే నా ఇంట్రెస్ట్ అని. అప్పటికే రెండు ఇంటర్న్​ షిప్​లు చేశా. నా సబ్జెక్ట్​ ఇమేజ్ ప్రాసెసింగ్. కాబట్టి, దానికి సంబంధించి అమెరికా ఎయిర్​ ఫోర్స్​లో జాబ్ వచ్చింది. కానీ, ఆ జాబ్​ ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు చేయలేకపోయా. నాకు ఆ జాబ్​లో శాటిస్​ఫాక్షన్​ దొరకలేదు. దాంతో ఆ జాబ్​ మానేశా. ఇంకేదైనా చేయాలని, క్రియేటివిటీకి సంబంధించిన వాటి కోసం వెతుకుతున్నా. అప్పుడు నాకు సినిమాలు గుర్తొచ్చాయి. రెడ్ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్ ఛానెల్​లో అసిస్టెంట్ డైరెక్టర్​గా నా జర్నీ స్టార్ట్ చేశా. కాలేజీ​లో ఉన్నప్పుడు ఐఎండీబీలో 250 షోలు ఉంటే, వాటిలో ఇండియన్ షో ఒక్కటి కూడా లేదని ఫీల్ అయ్యే వాళ్లం. మనమెందుకు అలాంటిది ఒకటి ట్రై చేయకూడదు అనిపించేది. ఆ ఆలోచనతోనే ఎంటీవీలో ప్రోగ్రామ్స్​ చేశా.

టీవీఎఫ్ ఎందుకు పెట్టానంటే..

బ్రాండెడ్ కంటెంట్ ఇచ్చే కంపెనీగా 2010–11 మధ్యలో టీవీఎఫ్​ మీడియా ల్యాబ్స్  మొదలుపెట్టాం. అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుతో సొంతంగా టీవీ షో చేయొచ్చనే  నమ్మకం ఉన్నప్పుడే మొదలుపెట్టా. ఒకటిన్నర ఏడాదిపాటు చాలా షోలు చేయాలనుకున్నా. కానీ, అవన్నీ రిజెక్ట్​ అయ్యాయి. అప్పుడు నేను సొంతంగా ఆన్​లైన్​ షో ట్రై చేయాలనుకున్నా. అలా టీవీఎఫ్​ ఆన్​లైన్ నెట్​వర్క్ ఎంటర్​టైన్​మెంట్​ స్టార్ట్​ అయింది. అప్పుడు నేను ఒక ఇంజినీర్​లా ఆలోచించా.. ఇంటర్నెట్​, టెక్నాలజీ వాడుకుని యూత్​కి కనెక్ట్ అవ్వాలనుకున్నా. ఇలా ప్రతి దాంట్లో నన్ను నేను బిల్డ్ చేసుకుంటూ వెళ్లా. నాకెవరూ గైడెన్స్​ ఇచ్చేవాళ్లు లేరు. దాంతో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్లా. ప్రతి పనిని ఎంజాయ్ చేశా. అయితే, ఎలాంటి గైడెన్స్​, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక పనిలో సక్సెస్​ అవ్వడం చాలా కష్టం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నేను నమ్మేది ఒక్కటే.. మనసులో ఒకటి చేయాలి అనుకుంటే దాని గురించే ఆలోచించాలి. చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేయాలి. దాన్నే ఫాలో అవుతున్నా. చదువుకునే రోజుల్లో బిహార్​లో కోటా అనే ఊళ్లో కొన్ని రోజులు ఉన్నా. ఆ ఊరు ఇండియాలోని మరో వైపు​ని నాకు పరిచయం చేసింది. ఇప్పుడు నేనిలా ఉండడానికి కారణం కూడా ఆ ఊరే. అక్కడ చాలా విషయాలు నన్ను ప్రభావితం చేశాయి. ఇప్పటికీ ప్రతి ఏడాది కోటాకి వెళ్లొస్తా. 

ఫ్యామిలీ గురించి..

1982లో బిహార్​లోని ముజాఫర్​పూర్​ జిల్లాలో పుట్టా. ఆరో తరగతి వరకు ఇద్దరు అన్నదమ్ములతో కలిసి ఊళ్లోనే చదివా. ఆ తర్వాత జైపూర్​లోని విద్యాశ్రమంలో చదివా. నాకు ఎంతోకాలంగా పరిచయం ఉన్న అమ్మాయి శ్రుతి రంజన్​ని 2013లో పెండ్లి చేసుకున్నా. 

ది వైరల్ ఫీచర్ ఛానెల్ సబ్​స్ర్కైబర్స్ : 11.2 మిలియన్స్​ 
నెట్ వర్త్ : ఇరవై మిలియన్​ డాలర్లు
ఇతర ఛానెల్స్ :     ది స్ర్కీన్ పట్టి (5.7మిలియన్ సబ్​స్ర్కైబర్స్), గర్లియప 
(4.6 మిలియన్ సబ్​స్ర్కైబర్స్​), ది టైమ్​లైనర్స్ (6.92 మిలియన్ సబ్​స్ర్కైబర్స్)