మల్కాజిగిరి, వెలుగు: కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి జోన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్/చేర్యాల్ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను కీసర గ్రామం వైపు అనుమతించరు. వాటిని ఓఆర్ఆర్/ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ద్వారా ఘట్కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు మళ్లిస్తారు. ఉద్దేమర్రి, బొమ్మలరామారం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కీసర క్రాస్ రోడ్ వైపు వెళ్లలేవు.
వాటిని రంగాపురం చౌరస్తా లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. షామీర్‌పేట్ నుంచి వచ్చే వాహనాలు యాదగిరిపల్లి క్రాస్ రోడ్ ద్వారా ఘట్కేసర్ వైపు లేదా సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్/చేర్యాల గ్రామం ద్వారా ఈసీఐఎల్ వైపు మళ్లించనున్నారు. బోగారం నుంచి వచ్చే వాహనాలు వన్నెగూడ క్రాస్ రోడ్ వద్ద కీసర దయారా మీదుగా వెళ్లి ఓఆర్ఆర్ ఆపై ఘట్కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
