హైదరాబాద్, వెలుగు: స్పినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాద్ కూకట్‌పల్లిలో ప్రారంభమైంది. తెలంగాణలో ఇది మొట్టమొదటి అతిపెద్ద వెన్నెముక చికిత్స కేంద్రం. డాక్టర్ జకినపల్లి శ్రీనాథ్ రావు దీనిని స్థాపించారు. వెన్నెముక సమస్యలకు అత్యాధునిక ఆపరేషన్లు, నొప్పుల ట్రీట్మెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
రోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ లక్ష్యమని స్పినోవా తెలిపింది. రాబోయే 18 నెలల్లోపు వెన్నెముక, ఆర్థోపెడిక్ రంగాల్లో మరిన్ని వినూత్న సేవలను విస్తరించడమే తమ ప్రాధాన్యత అని ప్రకటించింది.

