రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ కు నిరసనగా కొనసాగుతున్న అలర్లు

రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ కు నిరసనగా కొనసాగుతున్న అలర్లు
  • కశ్మీర్ వ్యాలీలో భారీగా భద్రత బలగాలు

శ్రీనగర్ : ట్రెరరిస్ట్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ కు నిరసనగా కశ్మీర్ లో యువకులు రాళ్ల దాడులు చేస్తున్నారు. అవంతిపురా ఏరియాలో స్థానికులు పోలీసులు, భద్రత బలగాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారని భద్రత బలగాలు తెలిపాయి. గురువారం పలు చోట్ల సైనిక బలగాలపై ఆటాక్స్ జరిగాయని చెప్పారు. బుధవారం రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ జరిగిన సమాచారం తెలిసిన వెంటనే లోకల్స్ రాళ్లతో పోలీసు వాహనాలపై ఆటాక్ చేశారు. లాక్ డౌన్ అమల్లో ఉండి పలు చోట్ల 144 సెక్షన్ ఉన్నప్పటికీ చాలా యువకులు రోడ్లపైకి వచ్చి రాళ్లు వేశారు. అవంతిపురా ఏరియాలో గురువారం ఉదయం నుంచి యువకులు దాడులు చేస్తూనే ఉన్నారని…ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాలను మొహరించినట్లు చెప్పారు. పుకార్లు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందకుండా ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. గతంలో బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు కూడా స్థానికులు సైనిక బలగాలపై దాడులకు పాల్పడ్డారు. దాదాపు మూడు నెలల పాటు లా అండ్ ఆర్డర్స్ అదుపు తప్పింది.