క్రీడా భారత్ పోటీలు విజయవంతం.. కిషన్ రెడ్డి హర్షం

క్రీడా భారత్ పోటీలు విజయవంతం.. కిషన్ రెడ్డి హర్షం

మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో క్రీడా భారత్ పేరిట నిర్వహించిన పోటీలు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.. జింఖానా మైదానంలో జరిగిన క్రీడా భారత్ ముగింపు కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర కృష్ణ నాగరాజులు మిగిలిన కమిటీ సభ్యులందరూ కలిసి ఆయనను సన్మానించి జ్ఞాపికను అందచేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సామాజిక సాంస్కృతిక స్పృహతో విద్యార్థుల మధ్య క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఈనెల 19వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే క్రీడాలలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుండి యువకులు విద్యార్థులు జర్నలిస్టులకు ఖేలో భారత్ తెలంగాణ పేరిట క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.