ఆరోగ్యమే మహాభాగ్యం.. అన్నారు పెద్దలు.. ప్రస్తుతం అనేక వ్యాధులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మొలకెత్తినవి తినాలని.. వీటి ద్వారా ఇమ్యూనిటిపవర్ పెరిగి ,చాలా వ్యాధులకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని ఫాలో అవుతుంటారు. కాని కొన్నింటి విషయంలో మొలకెత్తినవి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని ఓ అధ్యయనం తెలిపింది. ఎలాంటి పదార్దాలను మొలకెత్తినవి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
ప్రస్తుత రోజుల్లో మార్కెట్ కు వెళ్లి.. వారం లేదా 10 రోజులకు సరిపడ ఒకేసారి కూరగాయలు తెచ్చుకుంటాం. కొన్ని రకాల కాయగూరల్ని ఎక్కువరోజులు నిల్వ చేయడం వల్ల వాటి పైన మొలకలు వస్తుంటాయి. చాలా మంది వాటిని తొలగించుకొని వంట చేసుకుంటుంటారు. ఇలా మొలకలొచ్చిన కాయగూరల్ని తినకపోవ డమే మేలని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో నిరక్ష్యం వహిస్తే జీర్ణ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
బంగాళాదుంపలు :ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొలకలు వస్తాయి. క్రమంగా అవి పెద్దవవుతుంటాయి. చాలా మంది వాటిని తొలగించి వండుకుంటారు. మొలకలు వచ్చిన బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు..
మొలకలు వచ్చిన బంగాళదుంపల్లో.. కొన్ని రకాల విషప దార్థాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. , ఇవి కడుపులోకి చేరితే వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని హెచ్చ రిస్తున్నారు. గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల శిశువుకు ఆహారం అందిచే ట్యూబ్ లోపాలు, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని National Library of Medicine ఓ అధ్యయనంలో తెలిపింది
ఉల్లి... వెల్లుల్లి: ఇవి కూడా రోజుల పాటు నిల్వ చేస్తే కాడల మాదిరిగా మొలకలు వస్తాయి. కొందరు వీటిని ఉల్లికాడలనుకుని కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. కానీ, ఇవి ఆరోగ్యకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడల్ని కూరల్లో వాడాలనుకునేవారు... త్యేకంగా సాగు చేసిన వాటిని ఎంచుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు వెల్లుల్లి పైనా ఉల్లికాడల మాదిరిగా మొలకలు వస్తాయి. అలాంటి వాటిని ఒలిచి చూస్తే లోపల బ్లాక్ ఫంగస్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలాంటి వాటిని పడేయడమే మంచిదని చెబు తున్నారు.
వీటిని పచ్చిగా తీసుకోవద్దు
మాములుగా మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని పచ్చిగానే తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. కొంతమంది వీటితో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే, కొన్ని రకాల మొలకల్ని పచ్చిగా తీసు కోకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఆల్ఫాల్ఫా గింజలతో తయారుచేసిన మొలకలు, చిక్కుళ్ల మొలకలు.. పచ్చిగా తీసుకో వడం వల్ల కొంతమందిలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు
