హసన్‌పర్తి, వెలుగు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చినట్లు సంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. పెండం సాయి చరణ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించగా, డి.త్రిషల్ 42వ ర్యాంకు, ఎన్. మైత్రేయి 45, ఎం.డివిజ జ్యోతి తిరుమయి 142, ఎం.శ్రీధర్ 162, ఎ.ప్రణయ్ కుమార్ 178, జి.యువన్ చంద్ర 179, డి.ఇస్సాక్ 188, బి.సందీప్ 203, ఎల్. సాయి దీపక్ 225వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ను చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.

