V6 News

ఐసీఏఆర్లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్సాఆర్

ఐసీఏఆర్లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్సాఆర్

గ్రేటర్​వరంగల్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో స్కూల్, కాలేజీ ప్రోగామ్ స్థాయిలో ఐసీఏఆర్​ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా ఎస్సాఆర్ యూ నిలిచిందని ఆ యూనివర్సిటీ చాన్సలర్​ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సాఆర్ విజయాలకు సహకరించిన టీచర్స్, సిబ్బంది స్టూడెంట్స్​కు అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శమన్నారు.

స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్​ సంబంధిత కోర్సుల ప్రతిష్ట మరింత పెరగుతుందన్నారు. ఐసీఏఆర్​ గుర్తింపు పొందిన డిగ్రీలు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయని, విద్యార్థులు ఐసీఏఆర్ స్కాలర్​షిప్స్ నకు అర్హత పొందుతారని, విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్​ ప్రొఫెసర్​ పీవీ రమణరావు, ఆపరేషన్స్, గ్రోత్​ ప్రొఫెసర్ అర్చనారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులున్నారు.