శ్రావణం లగ్గాలకు కరోనా అడ్డం

శ్రావణం లగ్గాలకు కరోనా అడ్డం

మంచి ముహూర్తాలున్నా చేసుకోలేని పరిస్థితి
మార్చి నుంచి జులైకి.. ఇప్పుడు నవంబర్ కు వాయిదా
ఏటా శ్రావణంలో 3 లక్షల పెళ్లిళ్లు.. ఈ సారి లక్షలోపే
ఈనెల 23 నుంచి ఆగస్టు 14 వరకు మంచి రోజులు
చాలా లగ్గాలు కార్తీక మాసానికి వాయిదా
నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌లో మళ్లీ మంచి ముహూర్తాలు
కరోనాతో మ్యారేజ్ రిలేటెడ్ బిజినెస్లన్నీ డౌన్

హైదరాబాద్, వెలుగు: ఆషాఢం ముగిసింది. శ్రావణ మాసం ఎంటరైంది. శ్రావణం మొదలైందంటే పెళ్ళిళ్ల సందడి షురు అవుతుంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల పెళ్ళ్లిలు జరిగితే ఈ ఒక్క నెలలోనే 3 లక్షల నుంచి 4 లక్షల లగ్గాలు జరుగుతాయి. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పురోహితులు, మ్యాట్రిమోనీ ఓనర్లు, ఈవెంట్‌‌‌‌ మేనేజర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌‌‌‌లో 50 వేల నుంచి లక్ష పెళ్ళల్లకు మించి జరిగే పరిస్థితి లేదంటున్నారు.వైరస్‌‌‌‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో చాలామంది మ్యారేజీలను వాయిదా వేసుకుంటున్నారని చెబుతున్నారు. నవంబర్‌‌‌‌లో కార్తీక మాసంలో పెళ్ళ్లిలు చేసుకోవడం బెటర్‌‌‌‌ అని చాలామంది అనుకుంటున్నారని అంటున్నారు.

సోమవారం నుంచి శ్రావణ మాసం షురూ అయ్యింది. ఈ నెల 23 నుంచి ఆగస్టు 14 వరకు ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ నెల 26, 29, ఆగస్టులో 5, 13 తేదీలు బలమైన ముహూర్తాలని, ఈ రోజుల్లోనే ఎక్కువ పెళ్లిళ్లు ఉన్నాయని అంటున్నారు. ఇవి పోతే అక్టోబర్ 19 నుంచి 31 మధ్యే మళ్లీ ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.

వాయిదాల మీద వాయిదాలు వేయలేక..
ముహూర్త బలం, జాతక బలం లాంటి సెంటిమెంట్లు ఉన్నవారు శ్రావణ మాసంలోనే పెళ్లిళ్ళ్లిలు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. మార్చి, ఏప్రిల్‌ లో లగ్గం పెట్టుకొని వాయిదా వేసుకున్నవాళ్లు, రెండు, మూడు సార్లు పెళ్లి వాయిదా వేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడే కానిచ్చేద్దామనుని అనుకుంటున్నారు. ఇంట్లో ముసలి వాళ్లు ఉన్న కుటుంబాలు, ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యాక ఎక్కువ రోజులు ఆగడం మంచిది కాదనుకున్నవాళ్లు, సింపుల్‌గా చేసుకుందామనుకున్న వాళ్లు మ్యారేజీలకు రెడీ అవుతున్నారు. దీంతో వారం పాటు రోజుకో ఈవెంట్‌తో గ్రాండ్‌గా జరుపుకునే పెళ్లిళ్ళ్లిలు పోయి ఇపుడు పూటలో ముగిసే లగ్గాలు జరుగుతున్నాయి.

బంగారం కొంటలే
లగ్గాలు లేకపోవడంతో ఈ సీజన్ పై ఆధారపడి నడిచే వ్యాపారాలన్నీ కుప్పకూలిపోతున్నాయి. నగలు, బట్టల వ్యాపారాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పెరిగిన బంగారం ధరలతో మార్కెట్ పడిపోయిందని, కరోనాతో రోజువారీ గిరాకీ కూడా 20 నుంచి 30 శాతానికి మించడంలేదని పంజాగుట్టలోని ఓ జువెల్లరీ షోరూం మేనేజర్ వివరించారు. ఏటా ఒక్క శ్రావణ మాసంలోనే 3 వేల కిలోల బంగారం క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. బట్టల వ్యాపారంలో రూ.900 కోట్ల బిజినెస్ జరుగుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఇందులో 30 శాతం అమ్మకాలు జరిగినా.. 4 నెలల నిర్వహణ ఖర్చుల భారం తగ్గుతుందనే ఆశాభావంతో ఉన్నామంటున్నాయి.

తగ్గిన మ్యాట్రీమోనీ ఎన్‌రోల్స్
రాష్ట్రంలో 300కు పైగా మ్యాట్రిమోనీ సంస్థలు, 3 వేలకు పైగా అన్‌ ఆర్గనైజ్డ్ మ్యారేజ్ బ్యూరోలున్నాయి. వీటిలో ప్రతి నెల 4 వేలకు పైగా ఎన్ రోల్స్ జరుగుతుంటాయి. బేగంపేటలోని ఓ సంస్థలో ప్రతి నెల వెయ్యి నుంచి 1,500 మంది ఎన్ రోల్ చేసుకోగా, గత 4 నెలల నుంచి ఈ సంఖ్య 100కు మించడంలేదని చెబుతున్నారు. ఎన్ రోల్ చేసుకున్నా మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసుకోవడాన్నివాయిదా వేస్తున్నారని అంటున్నారు.

ఆన్‌లైన్‌లో మంత్రాలు
కరోనా భయంతో మండపానికి వెళ్లి లగ్గం చేసేందుకు పురోహితులు భయపడుతున్నారు. ఆన్ లైన్‌లో మంత్రాలు చదివేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలు ఓకే చెబుతున్నారు. మండపంలో వధువు, వరుడు ఉంటే, ఆన్ లైన్లో పంతులు మంత్రాలు చదివి లగ్గం చేయిస్తున్నారు.

అన్ని రంగాలు ఢమాల్
పెళ్లిళ్లిపై ఆధారపడే ఈవెంట్ ఆరనైజ్గర్లు, క్యాటరింగ్, ఫ్లవర్, లైటింగ్ డెకరేషన్, ఫంక్షన్ హాల్, డీజే, గిఫ్ట్ కార్నర్, బ్యూటీ పార్లర్లు, ట్రాన్స్ పోర్టు, ఫోటోగ్రఫీ వంటి ప్రధానమైన రంగాలపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఒక్క గ్రేటర్ లోనే 8,796 చిన్న, పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉండగా ఒక్కో ఫంక్షన్ హాల్ లో 100 నుంచి 150 మంది పనిచేస్తారని, వీరందరికి ఉపాధి పోయిందని మల్లాపూర్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ నిర్వహకుడు సుధాకర్ రెడ్డి చెప్పారు.

కార్తీక మాసంపైనే ఆశలు
వేసవిలో జరగాల్సిన మ్యారేజీలు శ్రావణ మాసానికి వాయిదా పడ్డాయి. ఇప్పుడు శ్రావణం నుంచి కార్తీక మాసానికి వాయిదా పడుతున్నాయి. కరోనా ఊరూరా విస్తరిస్తుండటంతో పెళ్లి చేయడానికే జనం భయపడిపోతున్నారు. పెళ్లిళ్లకు వెళ్లేందుకు చుట్టాలు జంకుతున్నారు. ఇప్పటిదాకా బయటపడ్డ కేసుల్లో ఏదో రకమైన ఫంక్షన్ల వల్ల వచ్చినవే ఎక్కువ. మ్యారేజీలు, బర్త్‌ డే పార్టీలు, చావులకు వెళ్లడం వల్ల ఎక్కువ కేసులు నమోదైన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో జనం నవంబర్ లో వచ్చే కార్తీక మాసంపై గంపెడాశలతో ఉన్నారు.

ముహూర్తాలున్నా భయపడుతున్నరు
గతేడాదితో పోల్చితే ఈసారి మంచి ముహుర్తాలు ఎక్కువే ఉన్నాయి. కానీ వేడుకలు చేయడానికి జనం భయపడుతున్నారు. ఏటా శ్రావణ మాసంలో ఒక్కో ముహూర్తానికి 3 నుంచి 5 పెళ్లిళ్లు ఫిక్స్ చేస్తుండే వాడిని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫిక్స్ చేసిన వాటిని కూడా వాయిదా వేస్తున్నారు. ముహుర్తాలు దాటిపోతే మళ్లీ రావనే కారణంతో కొందరు అయిష్టంగానే వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నరు.
– నాగేంద్ర శర్మ, పురోహితులు

బిజినెస్ దెబ్బతింది..
కరోనాతో వెడ్డింగ్ ప్లానింగ్ రంగం అంతా పూర్తిగా దెబ్బతింది. గతంలో వెయ్యి మందితో కంపెనీల కాన్ఫరెన్సులు జరిపే కాంట్రాక్టులు చేసే వాళ్లం. ఇప్పుడు జూమ్ యాప్ ద్వారా కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి. కరోనాతో ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు జరగటం లేదు. 50 మందితో గుళ్లు, ఇళ్లలోనే కానిస్తున్నారు. బిజినెస్ లో భారీగా నష్టాలు వచ్చాయి.
– చైతన్య, వెడ్డింగ్ ప్లానర్, బంజారాహిల్స్

గ్రాండ్‌గా చేసుకుందామనుకున్నా
మార్చిలో పెళ్లి ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ కరోనాతో మ్యారేజ్ వాయిదా పడింది. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఇప్పుడేమో తక్కువ మందితో చేసుకోవాలంటున్నారు. చుట్టాలు, ఫ్రెండ్స్ లేకుండా చేసుకోవాల్సి వస్తోంది.
– రవికాంత్ రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

For More News..

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్