శ్రీవిష్ణు కొత్త సినిమా.. టైటిల్ ముహూర్తం దసరాకు..

శ్రీవిష్ణు కొత్త సినిమా.. టైటిల్ ముహూర్తం దసరాకు..

ఎంటర్‌‌‌‌టైనింగ్ కాన్సెప్ట్స్‌‌తో వరుస సినిమాల్లో నటిస్తున్న  శ్రీవిష్ణు తాజాగా తన కొత్త ప్రాజెక్టుని  అనౌన్స్ చేశాడు. కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు.  స్కంద వాహన మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ టైటిల్‌‌ను దసరా కానుకగా అక్టోబర్ 2న రివీల్ చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు.

గన్స్, గ్రానైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో  క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.  ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌‌కుమార్, షైన్ టామ్  చాకో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, సత్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తుండగా, సాయి శ్రీరామ్ డీవోపీగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.