SRH vs RCB బిగ్ ఫైట్: ఉప్పల్ పిచ్‌పై పరుగుల వేట.. సన్‌రైజర్స్ టాప్-2 లోకి వెళ్లాలంటే.?

SRH vs RCB బిగ్ ఫైట్: ఉప్పల్ పిచ్‌పై పరుగుల వేట.. సన్‌రైజర్స్ టాప్-2 లోకి వెళ్లాలంటే.?

ఐపీఎల్ 2026లో అసలైన సిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

టోర్నమెంట్‌లో టాప్-2 స్థానాల కోసం జరుగుతున్న మహా సంగ్రామం ఇది.  ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఈ రెండు జట్లు.. ఇప్పుడు క్వాలిఫైయర్-1 రేసు కోసం పోటీపడుతున్నాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో, ప్లస్ 1.065 నెట్ రన్ రేట్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. మరి మన ఆరెంజ్ ఆర్మీ  16 పాయింట్లతో, ప్లస్ 0.35 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది సన్‌రైజర్స్. ఒకవేళ హైదరాబాద్ టాప్-2 లోకి వెళ్లాలంటే.. ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆర్‌సిబిపై భారీ విజయం సాధించాల్సిందే.

ఉప్పల్ పిచ్ అంటేనే బ్యాటర్ల స్వర్గధామం.. పరుగుల వరద పారడం ఖాయం. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని బోర్డు మీద భారీ స్కోరు  చేస్తే బెటరని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు.  మరి ఈ రాత్రి హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ జెండా ఎగురుతుందా? లేక ఆర్‌సిబి తన టాప్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందా చూడాలి. 

జట్లు:

SRH: పాట్ కమిన్స్ ( కెప్టెన్ ), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ , శివన్ కుమార్ అన్ద్కత్, ఎషన్ కుమార్ అన్ద్కత్, ఎషాన్ మలింగస్ సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్

RCB: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి , దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా , స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ , రసీ శర్మా దయాల్, భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేస్వాల్, మంగేష్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్