V6 News

జేఈఈ మెయిన్లో శ్రీచైతన్య డబుల్ రికార్డు

జేఈఈ మెయిన్లో శ్రీచైతన్య డబుల్ రికార్డు
  • 300/300తో ఇద్దరు విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్త ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్- 2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశాయి. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఇద్దరు విద్యార్థులు 300కు 300 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. కేవలం టాప్ ర్యాంకులే కాకుండా టాప్ 10, 100, 1000 విభాగాల్లో అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకుని శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

శ్రీచైతన్య విద్యార్థులు బీవీసీ శేఖర్ రెడ్డి, పాశం మోహిత్ అద్భుత ప్రతిభ కనబరిచి  వంద పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరితో పాటు ఆరుష్ సింఘాల్ (8వ ర్యాంకు), యశ్వర్థన్ (11వ ర్యాంకు), జేఆర్ మణిదీప్ రెడ్డి (15వ ర్యాంకు) టాప్ ర్యాంకర్ల జాబితాలో నిలిచారు.

వరుసగా మూడేండ్లుగా జేఈఈ మెయిన్‌‌లో 300/300 స్కోరు సాధించి హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పడం తమకే సాధ్యమైందని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కచ్చితమైన మైక్రో షెడ్యూల్స్, నిరంతర ఇంటర్నల్ పరీక్షలు, దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ శిక్షణే ఈ విజయానికి కారణమని వెల్లడించారు. ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌‌లైన్ యాప్, ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత విశ్లేషణను అందించి వారిని విజేతలుగా తీర్చిదిద్దామని వివరించారు.